నర్సీపట్నంలో హత్యకు గురైన నాగేశ్వరరావు బంధువులు టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. నాగేశ్వరరావు సొంత గ్రామమైన రామచంద్రపాలెం, అత్తగారి ఊరైన గురందరపాలెం గ్రామాలకు చెందిన బంధువులు నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.