మాదవధార: టోల్ గేట్ వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన

50చూసినవారు
విశాఖ నగరం మాధవధార వద్ద టోల్గేట్ తొలగించాలని ఆదివారం మాలలు ధరించిన అయ్యప్ప భక్తులు ఆందోళన నిర్వహించారు. మాలాధారణ ధరించిన భక్తులకు మినహాయింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో మాలలు ధరించిన భక్తులు రోజు మూడు పర్యాయాలు మాధవధారకు వెళ్లి స్నానాలు ఆచరిస్తారని వెళ్లిన ప్రతిసారి టోల్ గేట్ కట్టలేకపోతున్నామని వారు తెలిపారు. నిలదీస్తే వాహనాల కీస్ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్