విశాఖ- అరకు మధ్య స్పెషల్ రైళ్లు

75చూసినవారు
విశాఖ- అరకు మధ్య స్పెషల్ రైళ్లు
ఈ నెల 28 నుంచి జనవరి 19వ తేదీ వరకు విశాఖ-అరకు మధ్య స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ లను నడపనున్నట్టు విశాఖ రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. ప్రతి శని, ఆదివారాల్లో ఈ రైలు బయలుదేరుతుందన్నారు. ఉదయం 8.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుందని.. అరకుకు 11:45 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. అరకులో ఈ నెల 28 నుంచి జనవరి 19 వరకు శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అరకులో బయలుదేరి 6 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్