హోంమంత్రి వంగలపూడి అనితతో విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఆదివారం ఆమె నివాసంలో భేటీ అయ్యారు. నియోజకవర్గానికి సంబంధించి పలు సమస్యలను ఎమ్మెల్యే ఆమె దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతలు, మహిళల రక్షణ, మాదకద్రవ్యాలు గంజాయి నియంత్రణపై చర్చించారు. ఎమ్మెల్యే వెంట పలువులు జనసేన నాయకులు ఉన్నారు.