జి.మాడుగుల మండలంలోని నుర్మతి పంచాయతీ ప్రతి వాకపల్లి గ్రామానికి మంగళవారం పంచాయతీ నిధులతో 200 మీటర్ల మట్టిరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తల్లే.సూరిబాబు పాల్గొని కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మట్టిరోడ్డు నిర్మాణంతో వాకపల్లి గిరిజనుల రహదారి కష్టాలు తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చిన్న, సన్నిబాబు, వంశీ, మనోజ్, తదితరులు ఉన్నారు.