దేవీపట్నం: పొలాల్లోకి బోల్తా కొట్టిన బైక్

73చూసినవారు
దేవీపట్నం మండలం ఇందుకూరుపేట సమీపంలో చెరువు వద్ద ఆదివారం పొలాల్లోకి బైక్ దూసుకుపోయి బోల్తా కొట్టింది. బైక్పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారని స్థానికులు తెలిపారు. గోకవరం నుంచి ఇందుకూరుపేట సమీప గ్రామానికి వెళుతుండగా బైక్ అదుపు తప్పి ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు ఇందుకూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్