గంగవరం: నీరు లేక ఎండిపోయిన చెరువులు

79చూసినవారు
గంగవరం మండలంలో నీరు లేక చాలా చెరువులు ఎండిపోయి బోసిగా కనిపిస్తున్నాయి. కామరాజుపేట నుంచి కొత్తాడ గ్రామానికి వెళ్లే మార్గ మధ్యలో రెండు పెద్ద చెరువుల్లో నీరు లేక ఎండిపోయి ఉన్నాయని రైతులు తెలిపారు. ఈ చెరువుల్లో నీరు ఉంటే పంట పొలాలకు సాగునీరు అందేదని, సాగునీటి ఇబ్బందులు ఉండేవి కావని తెలిపారు. సూరంపాలెం ప్రాజెక్టు ద్వారా ఈ రెండు చెరువులకు నీటిని సరఫరా చేయాలని రైతులు గురువారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్