ఉద్యోగ భద్రత కోసం ఆందోళన బాట పట్టిన ఔట్సోర్సింగ్ టీచర్లు సోమవారం రంపచోడవరం ఐటీడీఎ ఎదుట మెడకు ఉరితాళ్లు తగిలించుకుని నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కాంట్రాక్టు విధానంలోకి తమను తీసుకోవాలని నినదించారు. ఏజెన్సీలోని అన్ని మండలాల నుంచి తరలివచ్చిన టీచర్లు వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు.