1966లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలను అర్పించిన అమృతరావుతో పాటు.. లెక్కలేనన్ని మంది ఇతరుల త్యాగం మన హృదయాలలో శాశ్వతంగా మండుతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. వారి రక్తం, కన్నీళ్లు నేడు ఒక కర్మాగారంగా మాత్రమే కాకుండా, తెలుగువారి గర్వం, గుర్తింపుగా నిలిచి దానికి పునాది వేశాయని.. సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా స్పందించారు. కేంద్రం విశాఖ ఉక్కుకు భారీ ప్యాకేజీ ప్రకటనపై పవన్ ఈ విధంగా స్పందించారు.