గ్రంథాలయాలు కేవలం పుస్తకాలను భద్రపరిచే భాండాగారాలు కావని, అవి విజ్ఞాన వికాసానికి వేదికలని ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ జీ. ఎస్. ఎన్. రాజు అభివర్ణించారు. అల్లిపురం, వెంకటేశ్వర మెట్ట ప్రాంతంలో శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయాన్ని శుక్రవారం పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీ. ఎస్. ఎన్. రాజు హాజరై రిబ్బన్ కట్ చేశారు.