యలమంచిలి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ పదవి విరమణ చేసిన హోంగార్డు జి. అప్పారావుకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా గురువారం ఆర్థిక సహాయం అందజేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుల ఒకరోజు డ్యూటీ అలవెన్స్ మొత్తం రూ. 3, 82, 690 చెక్కును గురువారం అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందించారు. అప్పారావు ప్రశంసాపూర్వకమైన విధులు నిర్వహించారని అభినందించారు.