విస్తరణ పనుల మ్యాప్ ను పరిశీలించిన కలెక్టర్

54చూసినవారు
విస్తరణ పనుల మ్యాప్ ను పరిశీలించిన కలెక్టర్
అచ్యుతాపురం నాలుగు రోడ్ల జంక్షన్ ప్రాంతంలో రహదారి విస్తరణ పనులు చేపట్టేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా బుధవారం అచ్యుతాపురంలో పర్యటించిన కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తో కలిసి విస్తరణకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి అధికారులతో చర్చించారు. ముందుగా ఎస్ఈజెడ్ దెబ్బపాలెంలో స్పోర్ట్స్ హబ్ క్రీడల మైదానాన్ని పరిశీలించారు.

సంబంధిత పోస్ట్