అంబటి రాంబాబు ఒక నీచుడు: అల్లుడు (వీడియో)

37810చూసినవారు
వైసీపీ మంత్రి అంబటి రాంబాబు నిజస్వరూపాన్ని ఆయన సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ బయటపెట్టారని టీడీపీ పోస్టు పెట్టింది. ఈ వీడియోలో.. సొంత కుటుంబ సభ్యులే జగన్‌ను ఛీ కొడుతున్నారని, వైసీపీ అభ్యర్థుల్ని ప్రజలు ఎందుకు మోయాలని గౌతమ్ ప్రశ్నించారు. అంబటి రాంబాబు అంతటి నీచుడ్ని నేనెక్కడా చూడలేదని, ఇలాంటి వ్యక్తికి ఓటు వెయ్యకండని ఆయన కోరారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.