వైఎస్ జగన్ ప్యాలెస్‌లపై అమిత్ షా ఆరా

56చూసినవారు
వైఎస్ జగన్ ప్యాలెస్‌లపై అమిత్ షా ఆరా
AP: టీడీపీ ముఖ్యనేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా విందు సమయంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్‌కు ఎన్ని ప్యాలెస్‌‌లు ఉన్నాయని అమిత్ షా ఆరా తీశారు. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయల్లో మొత్తం 4 ప్యాలెస్‌లు ఉన్నాయని మంత్రి లోకేశ్ వివరించారు. ఒక్కో ప్యాలెస్‌ ఎంత విస్తీర్ణంలో ఉందని అమిత్ షా అడిగారు. బెంగళూరు ప్యాలెస్ 30 ఎకరాల పైనే ఉందని, మిగిలినవి దాదాపు 6 ఎకరాల్లో ఉన్నాయని లోకేశ్ సమాధానమిచ్చారు.

సంబంధిత పోస్ట్