కెనరా బ్యాంక్ గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీని ఈ బ్యాంకు ప్రారంభించింది. ఈ క్రమంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు canarabank.com అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. స్పెషల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ ఈ నెల 6న మొదలైంది. దరఖాస్తు చివరి తేదీ జనవరి 24తో ముగియనున్నది. ఎంపికైన వారికి వేతనం ఏడాదికి రూ.18- 27లక్షల వరకు ఉంటుంది.