సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుండగుడు బంగ్లాదేశ్ పౌరుడని ముంబై పోలీసులు మీడియాకు వెల్లడించారు. అతడి పేరు మహమ్మద్ షరిపుల్ ఇస్లామ్ షెహజాద్ అని, వయసు 30 ఏళ్లు అని తెలిపారు. అక్రమంగా ఇండియాలోకి చొరబడి, 6నెలల క్రితం ముంబైకి వచ్చాడన్నారు. ఇండియాకు వచ్చాక విజయ్ దాస్‌గా పేరు మార్చుకున్నాడని చెప్పారు. నిందితుడు చోరీ చేసేందుకే సైఫ్ అలీఖాన్ ఇంటికి వెళ్లాడని పేర్కొన్నారు.