AP: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ వివాదాలపై నివేదిక కోరారు. సొంత పార్టీ నేతల నుంచే ఫిర్యాదులు రావడంతో చర్యలకు సిద్ధం అయ్యారు. అందులో భాగంగా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరు కావాలని కొలికపూడికి తాజాగా ఆదేశాలు అందాయి. వరుస ఘటనలపై వివరణ కోరనున్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కొలికపూడిపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.