నోవాటెల్‌కు చేరుకుంటున్న బీజేపీ నేతలు

77చూసినవారు
నోవాటెల్‌కు చేరుకుంటున్న బీజేపీ నేతలు
AP: విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా పార్టీ నేతలు నోవాటెల్‌కు చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలు, ఇతర కీలక అంశాలపై అమిత్ షా చర్చించనున్నట్టు సమాచారం. అంతేకాక, రాష్ట్ర బీజేపీ కొత్త నేతృత్వంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్