AP: విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలోని ఓ హోటల్ గదిలో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగకు చెందిన జీవన్ శర్మ అని పోలీసులు గుర్తించారు. హోటల్ యజమాని ఇచ్చిన సమాచారం మేరకు హోటల్‌కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.