379. 40 అడుగులకు చేరుకున్న తాండవ నీటిమట్టం

64చూసినవారు
379. 40 అడుగులకు చేరుకున్న తాండవ నీటిమట్టం
భారీ వర్షాలతో నాతవరం మండలం తాండవ రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం సాయంత్రానికి 379.40 అడుగులకు చేరుకుంది. 4 గేట్లు ఎత్తి 8500 క్యూసెక్కుల నీటిని తాండవ నదిలోకి విడుదల చేసినట్లు డిఈ అనురాధ తెలిపారు. తాండవ నదిలోకి ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరుతుందని తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసామన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదన్నారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్ రిజర్వాయర్ ను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్