మహారాష్ట్రలోని కోలాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఈసందర్భంగా వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ భక్తి శ్రద్ధలతో పూజలో పాల్గొని ఆశీర్వాదాలు తీసుకొన్నారు. అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.