రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ జన రంజకంగా ఉందని ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వి. బాబురావు అన్నారు. సోమవారం మద్దిలపాలెంలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, జలవనరులు తదితర రంగాలకు అధికంగా కేటాయింపులు చేశారని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ను రూపొందించినట్లు తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం భావిస్తుందన్నారు.