వృద్ధుల దినోత్సవంలో పాల్గొన్న జడ్జి

80చూసినవారు
వృద్ధుల దినోత్సవంలో పాల్గొన్న జడ్జి
జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని మాడుగుల సెయింట్ ఆన్స్ వృద్ధాశ్రమంలో మంగళవారం సాయంత్రం వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి స్వర్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో గల వృద్ధులతో ముచ్చటించారు. ఆశ్రమ నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. మీరంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని వృద్ధులకుఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్