మునగపాక మండలం గవర్ల అనకాపల్లి వంతెన వద్ద నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు రహదారికి మరమ్మతులు చేపట్టారు. గుంతలు పడి ఈ రహదారి మరమ్మతులకు గురి కావడంతో ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ సూచన మేరకు కూటమి నాయకులు సుమారు రూ. 30 వేలు వరకు ఖర్చు చేసి గుంతలను పూడ్చినట్లు టీడీపీ నాయకుడు మురళీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్, జనసేన మండల అధ్యక్షుడు పరుశురాం పాల్గొన్నారు.