గుత్తి మండల వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలని వర్కింగ్ జర్నలిస్ట్ నాయకులు డిమాండ్ చేశారు. గుత్తి పట్టణంలోని ఆర్ అండ్ బి బంగ్లాలో ఆదివారం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.