పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఓ ఎద్దు మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రైతు సుదర్శన్ ఇసుకను ఎడ్లబండిలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగ ఎద్దును తాకడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. రైతు అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో రూ. 60వేలు విలువ చేసే ఎద్దు మరణించిందని, తనకు ఉపాధి పోయిందని వాపోయారు.