గుత్తిలోని ఓల్డ్ సీపీఐ కాలనీలో తాగునీటి పైప్ లైన్ రెండు చోట్ల డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి నీరు వృథాగా పోతోంది. కాలనీ వాసులు మున్సిపల్ అధికారులు, వాటర్ వర్క్స్ సిబ్బందికి సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మున్సిపల్ అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.