కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో
చాలాకాలంగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను క్రమబద్ధీకరించడంలో భాగంగా సోమవారం టీ సర్కిల్ కూడలి వద్ద డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో పాత బస్టాండు వద్ద డ్రైనేజీ సంపు పనులను పూర్తి చేశారు. ఈ సంపుకు అనుసంధానంగా డ్రైనేజీ కాలువల నిర్మాణాలను వేగంగా నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పనులను భారీ యంత్రాలతో నిర్వహిస్తున్నారు.