పోలీసుల అదుపులో జూదరులు

56చూసినవారు
పోలీసుల అదుపులో జూదరులు
యాడికిలోని జూద శిబిరం పై ఆదివారం పోలీసులు దాడులు జరిపారు. సీఐ ఈరన్న వివరాల మేరకు జూదం ఆడుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది కలిసి స్థానిక చౌడేశ్వరి ఆలయం వెనుక ఉన్న శిబిరంలో దాడి చేయగా, యాడికికి చెందిన నాగేంద్ర, రంగనాయకులు, రాజశేఖర్, రామమోహన్ ఆచారి మరో ఇద్దరు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 5, 200 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.

సంబంధిత పోస్ట్