తాడిపత్రి మండలంలోని సజ్జల దిన్నె గ్రామ సమీపంలో మంగళవారం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. పెన్నానది నుంచి ఇసుకను అనుమతులు లేకుండా తరలిస్తుండడంతో సిబ్బందితో దాడి చేసి పట్టుకుని సీజ్ చేశామని, అలాగే డ్రైవర్లు శంకర్, శివ ను అరెస్ట్ చేశామని తెలిపారు.