ఉరవకొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. సుమారు గంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఉరవకొండ పట్టణంలో ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా టవర్ క్లాక్ ప్రాంతంలో భారీగా వర్షపునీరు నిలిచిపోయింది. దింతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.