Jan 06, 2025, 08:01 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
Jan 06, 2025, 08:01 IST
కాలేజీకి వెళ్ళమని చెప్పడంతో ఓ ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. 3వ టౌన్ పరిధికి చెందిన లక్ష్య ఇంటర్ మొదటి సంవత్సరం ఓ ప్రైవేటు కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుతోంది. నెల రోజుల కిందట ఇంటికి వచ్చిన బాలిక తిరిగి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు హాస్టల్కు వెళ్లి చదువుకోవాలని చెప్పడంతో క్షణికావేశంలో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సోమవారం తెలిపారు.