Jan 18, 2025, 02:01 IST/
కొత్త రేషన్ కార్డులు జారీ చేసేది అప్పుడే?
Jan 18, 2025, 02:01 IST
తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు నూతన కార్డులకు అర్హమైనవిగా పౌరసరఫరాలశాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ జాబితాను 33 జిల్లాలకు పంపించింది. ఈ నెల 20 నుంచి 24 వరకు 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, బస్తీ సభలు నిర్వహిస్తారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది జాబితా ఖరారవుతుంది. జిల్లా కలెక్టర్ల ద్వారా వచ్చే జాబితాల మేరకు పౌరసరఫరాల శాఖ కార్డులను మంజూరు చేస్తుంది. జనవరి 26న జారీ ప్రారంభం అవుతుంది.