TG: విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. 3,260 పోస్టులు భర్తీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. NPDCL-వరంగల్‌లో 2,212 JLM, 30 సబ్ ఇంజినీర్, 18 అసిస్టెంట్ ఇంజినీర్, SPDCLలో 600 JLM, 300 సబ్ ఇంజినీర్, 100 AE పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.