దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌లో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఘాట్ వద్ద పూలను ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ఇవాళ ఉదయం 8.30కి ఏపీ మంత్రి నారా లోకేశ్, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించనున్నారు.