మహిళను హత్య చేసిన నిందితుడిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ తెలిపారు. గురువారం చిన్న కొడపల్కు చెందిన గొరిగే సత్యవ్వ (55) వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా శుక్రవారం పిట్లంలో గొరిగే రవిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తాగుడుకు బానిసై మేనత్తను హత్య చేసి, ఆభరణాలను అపహరించినట్లు సీఐ వెల్లడించారు.