కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు, పే రివిజన్ కమిషన్ మొదలైన డిమాండ్ల సాధన కోసం పోరాటంలో పాల్గొన్న టీచర్ల పై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించడం పై ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ శనివారం హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అనంతపురంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.