అనంత: పోలీసు రక్షక్ పాఠశాలకు టేబుల్స్ వితరణ

62చూసినవారు
అనంత: పోలీసు రక్షక్ పాఠశాలకు టేబుల్స్ వితరణ
అనంతపురంలోని పోలీస్ రక్షక్ ప్రీ ప్రైమరీ పాఠశాలకు ఆర్డీటీ సంస్థ, భవిష్య ఇరిగేషన్ సంస్థ నిర్వాహకులు శ్రీనివాసులు బుధవారం 40 టేబుల్స్ వితరణ చేశారు. కార్యక్రమాన్ని ఆర్డీటీ మహిళా సాధికారత విభాగం డైరెక్టర్ విశాల ఫెర్రర్, జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ పిల్లలు చదువులకు ఇబ్బంది పడకుండా ఉండాలని టేబుల్స్ అందించినట్లు తెలిపారు. టేబుల్స్ అందించిన దాతలను ఎస్పీ ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్