ఉమ్మడి అనంత జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. మోటార్ వాహనాల ప్రమాద కేసులు, సివిల్, చెక్ బౌన్స్ కేసులు, కుటుంబ తగాదాలు, పారిశ్రామిక వివాదాలు, రాజీ చేయదగిన క్రిమినల్ కేసులకు జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కారం పొందవచ్చు అని తెలిపారు.