ఇటీవలే అహోడా ఛైర్మన్ పదవిని దక్కించుకున్న జనసేన నాయకుడు టి. సి. వరుణ్ ఫ్లెక్సీలను గురువారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. నగరంలోని మూడవ డివిజన్లో పలు కూడళ్ళల్లో వరుణ్ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇది మింగుడు పడని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేశారని ఆయన అభిమానులు ఆరోపించారు.