What: వి ఎన్ ఐ వి అద్వర్యం లో తలపెట్టిన రైల్ రోకో కు వెళ్లకూడదని రాష్ట్ర అధ్యక్షుడు టి పి రామన్న కు పోలీసులు ఆదివారం అనంతపురంలో ముందస్తు నోటీస్ లు ఇచ్చారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో వై సీ పీ ప్రభుత్వం ఏర్పడి మూడున్నర సంవత్సరాలు కావస్తున్నా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయక కాలయాపన చేస్తున్నారని అన్నారు. వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.