బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. నేడు సత్యసాయి, 30న అనంతపురం, సత్యసాయి, డిసెంబర్ 1న అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు