తహశీల్దార్ కార్యాలయాల్లోని రికార్డు రూములను అక్టోబర్ 2వ తేదీ లోపల నవీకరించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని ఆర్డీఓ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయాన్ని జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం పామిడి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. రికార్డ్ రూములను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.