అనంతపురం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా జడ్జి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ జగదీష్ శనివారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ. బాధితులకు సత్వర న్యాయం అందించాలని లోక్ అదాలత్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అందరు కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.