రిలయన్స్‌పై దాడి కేసు ఉపసంహరణ

2620చూసినవారు
రిలయన్స్‌పై దాడి కేసు ఉపసంహరణ
రిలయన్స్‌ మార్ట్‌పై దాడి, ధ్వంసం కేసును ప్రభుత్వం ఉపసంహరించుకుంటూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం రాష్ట్రంలో ఆందోళనలు, నిరసనలు చోటు చేసుకున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అనంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలోని రిలయన్స్‌ మార్ట్‌ను కొందరు నాయకులు తగులబెట్టారు. ఈ ఘటన అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. ఈ విధ్వంసంపై అప్పటి మూడో పట్టణ సీఐ యు.నరసింగప్ప నిందితులపై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసును సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. 73 మంది నిందితులుగా ఉన్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కేసును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ట్యాగ్స్ :