కరువు జిల్లాలో కార్మికుల సమస్యలు ప్రభుత్వంకు పట్టవా అని టీఎన్ టియూ సి అనంతపురం జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మి నరసింహులు డిప్యూటీ లేబర్ కమిషనర్ జీ. లక్ష్మి నరసింహ ను ప్రశ్నించారు. బుదవారం స్థానిక కార్మిక శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో డీసీ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పోతుల లక్ష్మి నరసింహులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.