అనంతలో కరోనా బీభత్సం..మరో 90 మందికి పాజిటివ్

40304చూసినవారు
అనంతలో కరోనా బీభత్సం..మరో 90 మందికి పాజిటివ్
అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. గత కొద్దిరోజులుగా కరోనా మహమ్మారి జిల్లా ప్రజలను హడలెత్తిస్తోంది. భారీ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. మెున్నటి వరకు కరోనా దెబ్బకు పట్టణాలన్నీ వణికిపోయాయి. తాజాగా కరోనా దెబ్బకు పల్లెటూర్లు సైతం వణికిపోతున్నాయి. గత 24 గంటల్లో జిల్లాలో 90మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దాంతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1028కి చేరుకున్నాయి.

ఇకపోతే జిల్లాలో 674మంది ఐసోలేషన్ వార్డులో చికిత్సపొందుతుండగా 347 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో కరోనా మహమ్మారితో ఏడుగురు మృతి చెందారు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అనంతపురంలో లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. ఈనెల 21నుంచి లాక్ డౌన్ ను అమలు చేస్తోంది. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, హిందూపురం, యాడికి, పామిడి, కదిరి, గుంతకల్లు ప్రాంతాల్లో లాక్ డౌన్ కఠినంగా అమలు అవుతోంది.