AP: వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా స్కీమ్‌ను ఈ ఏడాది విద్యా సంవత్సరానికి అమలు చేయలేమని పరోక్షంగా కూటమి ప్రభుత్వం చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతి విద్యార్థికి తల్లికి వందనం వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం రావడంతో 80 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు.