ఏపీలోని నూజివీడు మండలం మర్రిబందం గ్రామంకు చెందిన దోనవల్లి వెంకట్రావును వాటర్ ట్యాంక్ వద్ద కట్టేసి మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి కొట్టారు. ఇందుకు తన తండ్రి, తనయుడి సాయం తీసుకున్నారు. వెంకట్రావును కొట్టి.. తనను కొడుతున్నారంటూ 112కి కాల్ చేసిన ప్రభావతి పోలీసులను తప్పుదోవ పట్టించారు. స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసి.. ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. వెంకట్రావును ఆమె కట్టేసి కొడుతుండగా.. కొందరు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అసలు విషయం బయటపడింది.