కర్ణాటకలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోసూరు-బెంగళూరు జాతీయ రహదారిలోని బొమ్మసంద్ర పారిశ్రామికవాడలో వెయ్యి మందికి పైగా కార్మికులు పని చేసే ఈ కంపెనీలో షార్క్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. రూ.కోట్ల విలువ చేసే దుస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. 7 అగ్నిమాపక వాహనాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.